- వచ్చే వారం కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలోని వివిధ కాలేజీల్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో మిగిలిపోయిన సీట్ల భర్తీకి వచ్చే వారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జీఈ సీహెచ్. విద్యాసాగర్ తెలిపారు. వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఈ సీట్లను నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు విడతలవారీగా భర్తీ చేయనున్నట్టు చెప్పారు. నవంబర్ 2న ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా సీట్లకు ఎంపిక చేపడతారు.
నవంబర్ 3న తుది మాప్‌అప్ రౌండ్ కౌన్సెలింగ్, నవంబర్ 4న ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. చివరిగా నవంబర్ 5న అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుంది. పూర్తి వివరాలు, నిబంధనల కోసం అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.pjtau.edu.in ను సందర్శించాలని రిజిస్ట్రార్ సూచించారు.
